40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు .. 40 సీట్లు కూడా రాకపాయే ..

Update: 2019-05-23 07:44 GMT

మరికాసేపట్లో ఎన్నికల ఫలితాల పై క్లారిటీ రానుంది ఇప్పటివరకు వైసీపీ అటు శాసనసభలోను ఇటు లోక్ సభలోనూ మంచి దూకుడుని ప్రదర్శిస్తుంది.ఇక టిడిపి దరిదాపుల్లో కూడా పోటి ఇవ్వడం లేదు .. ఎన్నికల ఫలితాలకు ముందు విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ని టిడిపి తీసి పారేసింది.. ఇక చంద్రబాబు కూడా నలబై ఏళ్ల తన రాజకీయ జీవితంలో అయన ఇంత ఓటమిని ఎప్పుడు చూడలేదేమో బహుశా ... కనీసం నలబై సీట్లు కూడా గెలుచుకోలేకపోవడం నిజంగా దారుణం అనే చెప్పాలి .. అధికార పార్టీలో ఉండి కూడా చంద్రబాబు మరి ఇంత ఘోర ఓటమిని చవిచూడడం దారుణమని   పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తునారు .. నలబై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు తన పార్టీకి నలబై సీట్లు కూడా తెచ్చుకోకపోవడం పై వైసీపీ నేతలు కామెంట్స్ పేలుస్తున్నారు ..  

Similar News