సార్వత్రిక ఎన్నికల్లో రేపు మూడో ఘట్టం

Update: 2019-04-22 03:00 GMT

సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఘట్టం రేపు పూర్తికానుంది. 14 రాష్ట్రాల్లో 115 లోక్‌సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. అంతేకాదు ఏఐసీసీ అధ్యక్షుడు రాహు‌ల్‌గాంధీతోపాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా మూడో దశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ ప్రచారం ముగిసింది. రేపు 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అసోంలో 4, బీహార్‌లో 5, ఛత్తీస్‌‌గఢ్‌లో 7, గుజరాత్‌లో 26, గోవాలో 2, జమ్మూకశ్మీర్‌లో 1, కర్నాటకలో 14, కేరళలో 20, మహారాష్ట్రలో 14, ఒడిషాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 10, దాద్రా హవేలీలో 1, డయ్యూలో 1, పశ్చిమబెంగాల్‌లో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

థర్డ్‌ ఫేజ్‌లో పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహు‌ల్‌గాంధీతోపాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా ఎంతోమంది ప్రముఖులు మూడో దశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక రెండో దశలో వాయిదాపడ్డ త్రిపుర ఈస్ట్‌, తమిళనాడులోని వేలూరు పార్లమెంట్ స్థానాలకు కూడా రేపే పోలింగ్ జరగనుంది. 

Similar News