న్యాయం కోసం.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి

Update: 2019-03-05 07:59 GMT

వరంగల్ అర్బన్ జిల్లా పెగడపెళ్లిలో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ ఓ యువతి సెల్ టవరెక్కింది. స్ధానికంగా ఉన్న నక్క మోషే అనే యువకుడు తనను 9 సంవత్సారాల నుంచి ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకోమని కోరితే నిరాకరిస్తున్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. మోషేతో తన పెళ్లి చేయకపోతే టవర్ నుంచి దూకి చనిపోతానంటూ బెదిరించింది. యువతి టవరెక్కిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమించిన యువకుడితో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.  

Similar News