వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా బాసర ఆలయం..

Update: 2019-06-23 07:51 GMT

బాసర ఆలయం వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదం దేవాలయంలో రాజుకుంటోంది. మొన్నటి దాక విగ్రహాల గోల్‌మాల్, నిధుల లూటీ ఇలా ఒక్కటేమిటీ.. ఎప్పుడు ఏదో లొల్లి నడవగా.. ఇప్పుడు లడ్డూలో పురుగులు బయటపడటంతో మళ్లీ వివాదం నెలకొంది.

బాసరకు నిత్యం వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులు...అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. పూజల అనంతరం భక్తులు అమ్మవారి ప్రసాదాలు స్వీకరిస్తారు. నిన్న హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కుటంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. లడ్డు ఓపెన్ చేసి చూడగా బొద్దింక బయటపడటంతో షాక్‌కు గురయ్యారు.


 







ప్రసాదంలో వచ్చిన పురుగు విషయంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆలయంలో లడ్డూ తయారీ, సరఫరా విక్రయ కేంద్రాలలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో తనికీలు చేపడ్డారు. ఆహార పదార్థాలు, లడ్డు సంబంధించిన పదార్థాలను సేకరించి అధికారులు నాచారం ల్యాబ్‌కు పంపించారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆలయ అధికారులు మాత్రం అలాంటిదేం లేదంటూ బుకాయిస్తున్నారు. 

Tags:    

Similar News