ఈ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే ..

Update: 2019-06-02 04:59 GMT

నగదు లావాదేవీలు అనేవి ప్రతి ఒక్కరికి అవసరమే .. ప్రతిరోజూ దిన చర్యలో భాగంగా ఇది ఒకటిగా నిలుస్తుంది. అయితే ఈ నెలలో బ్యాంకులకు వచ్చే సెలవులను ఒక్కసారి తెలుసుకుందాం .. జూన్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 8, 22 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే జూన్ నెల‌లో వ‌చ్చే ఐదు ఆదివారాలు 2, 9, 16, 23, 30 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు. ఇవి మాత్రమే కాకుండా ఈ నెలలో జూన్ 5న (బుధవారం) రంజాన్ (ఈదుల్‌ ఫిత్ర్) సందర్భంగా మరియు జూన్ 6న (గురువారం) కూడా సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం తెలంగాణలోని బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది. ఏపీలోని బ్యాంకులకు జూన్ 5వ తేదీన మాత్రమే సెలవు ఉంటుంది. బ్యాంక్ సెల‌వు రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసుకొని ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది. 

Similar News