ఈసీ తీరును తీవ్రంగా తప్పుపట్టిన కళా

Update: 2019-05-15 12:25 GMT

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈసీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. అడిషనల్ సీఈవో సుజాత శర్మను కలిసిన కళా వెంకట్రావు రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలింగ్ బూత్‌ల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. వీటిలో రీపోలింగ్ జరగాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 బూతులపై వచ్చిన ఫిర్యాదుపై సీఈవో విచారణకు ఎందుకు ఆదేశించారని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

పోలింగ్ రోజున ఆ రెండు బూత్‌లపై టీడీపీ అభ్యర్థి నాని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ పోలింగ్ అయిన 24 రోజుల తర్వాత వైసీపీ అభ్యర్థి కొన్ని బూత్స్‌పై ఫిర్యాదు చేస్తే సీఈవో విచారణకు ఆదేశించారు. అయినా రీపోలింగ్ అయ్యాక విచారణ ఏంటి? అని ప్రశ్నించారు. ఈసీ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని కళా వ్యాఖ్యానించారు. సీఈవో ద్వివేది సెలవు నుంచి వచ్చాక టీడీపీ ఫిర్యాదుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుజాత శర్మ హామీ ఇచ్చారు.

Similar News