అమెజాన్ బంఫర్ ఆఫర్ ..

Update: 2019-06-20 07:49 GMT

పార్ట్ జాబు కోసం ఎదురు చూస్తున్న వారికి అమేజాన్ మంచి శుభవార్తని అందజేసింది .. ఖాళీగా ఉన్న సమయంలో అమెజాన్‌ ప్యాకేజీలను డెలివరీ చేసి గంటకు రూ. 140 వరకు సంపాదించుకోవచ్చునని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ద్వారా అమేజాన్ స్పష్టం చేసింది. కానీ రిజిస్టర్ అయ్యేవారికి కనీసం సొంత ద్విచక్రవాహనం ఉండాలని, ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వుండాలి. ఎందుకంటే అమెజాన్‌ ఫ్లెక్స్‌ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తోంది కాబట్టి.ప్యాకేజీలు డెలివరీ చేసే ముందు కంపెనీ పార్ట్‌టైమ్ ఉద్యోగులకు కొంత శిక్షణ కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌ను బెంగళూరు, ముంబయి, దిల్లీలో ప్రారంభించారు. త్వరలోనే భారత్‌లోని ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తమకు దొరికిన సమయాన్ని వృధా చేయకుండా యువత ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు అమేజాన్ సంస్థ తెలిపింది. 

Tags:    

Similar News