రాజమండ్రిలో ఇవాళ టీడీపీ జయహో బీసీ సభ

టీడీపీ ఆవిర్బావం నుంచి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలలో తమ పట్టు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు టీడీపీ సిద్ధమయ్యింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం వేదికగా జయహో బీసీ పేరుతో సభ నిర్వహిస్తుంది.

Update: 2019-01-27 05:07 GMT

టీడీపీ ఆవిర్బావం నుంచి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలలో తమ పట్టు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు టీడీపీ సిద్ధమయ్యింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం వేదికగా జయహో బీసీ పేరుతో సభ నిర్వహిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు హాజరయ్యే విధంగా వ్యూహ రచన చేశారు. టీడీపీ హయంలోనే బీసీలకు మేలు చేకురిందనే విషయాన్ని ఇదే వేధిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభా ఏర్పాట్లను ఏపీ మంత్రులు చినరాజప్ప, కలా వెంకట్రావు పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జయహో బిసి సదస్సు ప్రారంభం అవుతుందనని డిప్యూటీ సిఎం చినరాజప్ప తెలిపారు. బీసీ సంక్షేమం, అభివృద్ధి ప్రత్యేక కార్యాచరణ ప్రణాలికలను సీఎం చంద్రబాబు వెల్లడిస్తారని పార్టీ నేతలు చెప్పారు. టీడీపీ సభ సందర్భంగా పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టారు. జయహో బీసీ సభ నిర్వహాణ నేపద్యంలో రాజమండ్రి మీదుగా వెళ్లే వాహనాల రూట్ మళ్లించారు. సభకు తరలి వచ్చే వాహనాలు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలుపాలను సూచనలు జారీ చేశారు. 

Full View

Similar News