లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు...

Update: 2019-05-19 01:02 GMT

లగడపాటి అంటే తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు .. ఆంధ్రా రాష్ట్రం విడిపోకుండా అయన పన్నిన పన్నాగాలు అని ఇన్ని కావు. ఇక సర్వేలతో అయన ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు గాంచారు . అయితే అయన చేసిన కొన్ని సర్వేలు తారుమారు అయిన సందర్బాలు కూడా లేకపోలేదు .

2016 మేలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో లగడపాటి రాజగొపాల్ సర్వే పేరుతో జయలలిత పార్టి AIADMK ఒడిపొతుందని కరుణానిధి పార్టి DMK బంపర్ మెజారిటితో గెలవబొతుందని చెప్పారు. ఫలితాలు వచ్చేసరికి AIADMK జయలలిత పార్టికి 134 సీట్లు రాగా , DMK కరుణ నిధి పార్టికి 89 స్థానాలు మాత్రమే వచ్చాయి.ఈ ఫలితాలు లగడపాటి సర్వేని పూర్తిగా తారుమారు చేశాయి.

ఇక 2018 మేలో జరిగిన కర్నాటక ఎన్నికల్లో మెజారిటి సర్వేలు హంగ్ ఏర్పడుతుందని చెప్పగా, లగడపాటి సర్వే మాత్రం బిజేపికి తిరుగులేని మేజారిటి వస్తుంది, ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వంని ఏర్పర్చుతుంది అని చెప్పింది. తీరా ఫలితాలు వచ్చేసరికి లగడపాటీ సర్వే తారుమారు అయి, మెజారిటి సర్వేలు చెప్పినట్టుగా ఎవరికి ప్రభుత్వంని ఏర్పాటూ చెసే నెంబర్ రాక చివరికి కాంగ్రెస్ మద్దతుతో JD(S) కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ కూడా లగడపాటి సర్వే తారుమారైంది.

అలాగే 2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా మనం చూసాం. ఆంద్ర ఆక్టొపస్ సర్వే పేరుతో అయన చెప్పిన ఫలితాలు ఏమి బ్రహ్మ్మ వాక్కులు కాదని , ఆయన చెసిన సర్వేలలో తారుమారయిన సందర్భాలు అనేకం ఉన్నాయని , ఆయన చెపితే జరిగినట్టే అనే ఆపొహలో ఉండి బెట్టింగులకి దిగి ఒళ్ళు , ఇళ్ళు, గుళ్ళ చెసుకుని రోడ్డున పడొద్దని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు . 

Similar News