ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా ఏబీ వెంకటేశ్వరరావు

Update: 2019-04-22 14:44 GMT

మాజీ ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ ఆదేశాలతో ఇంటెలిజెన్స్‌ డీజీ పదవి నుంచి ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది ఈసీ. ఈ మేరకు జీవో నెంబర్‌ 882ను విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకు ఏసీబీ చీఫ్‌గా డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ కొనసాగారు. ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీ తర్వాత, డీజీపి ఠాకూర్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. కాగా శాంతిభద్రతలతో పాటు, అవినీతి నిరోధకశాఖ డీజీగా ఠాకూర్‌ బాధ్యతలు నిర్వర్తించేవారు. అదనపు బాధ్యతల నుంచి ఠాగూర్‌ను ఈసీ తప్పించింది. ఏసీబీ బాధ్యతలను శంఖ బ్రత బాగ్చికి అప్పగించారు. ఇంటెలిజెన్స్ బాధ్యతలను కుమార్ విశ్వజిత్‌కు అప్పగించారు.




 


  

Similar News