ఏపీ, తెలంగాణతోపాటు 18 రాష్ట్రాల్లో ఎన్నికలు

Update: 2019-04-09 13:20 GMT

సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత ప్రచార ఘట్టం ముగిసింది. ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. తొలి దశలోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత ప్రచారం ముగిసింది. నెలరోజులపాటు హోరాహోరీగా సాగిన ఫస్ట్ ఫేజ్ క్యాంపైనింగ్‌ క్లోజైంది. ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది.

ఏపీలో 25, అరుణాచల్‌లో 2, అసోంలో 5, బీహార్‌లో 4, ఛత్తీస్‌గఢ్‌లో 1, జమ్మూకశ్మీర్‌లో 2, మహారాష్ట్రలో 7, మణిపూర్‌‌లో 1, మేఘాలయలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్‌లో 1, ఒడిషాలో 4, సిక్కింలో 1, తెలంగాణలో 17, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో 5, పశ్చిమబెంగాల్‌లో 2, అండమాన్ నికోబార్‌లో 1, లక్షద్వీప్ 1 ఇలా మొదటి దశలో మొత్తం 91 పార్లమెంట్‌ స్థానాలకు ఏప్రిల్‌ 11న ఓటింగ్‌ జరగనుంది. ఇక తొలి దశలో మొత్తం 1280మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, అందులో 1188మంది పురుషులు, 92మంది మహిళలు ఉన్నారు. తొలి దశలోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న ఏపీలో 25 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 

Similar News