రెండు లక్షలు చెల్లించి 18 లక్షల కారు ఎత్తుకెళ్ళాడు..

Update: 2019-06-09 02:37 GMT

కారు టెస్ట్ డ్రైవింగ్ అంటూ కారును ఎత్తుకెళ్ళడం అనేది దాదాపుగా సినిమాలో మనం చూసుంటాం. కానీ నిజంగానే ఓ వ్యక్తి అలాగే చేసాడు .. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సంఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది . మంచి సూటు, బూటు వేసుకొని షో రూమ్ కి వచ్చాడు . ఎస్‌యూవీ కావాలని చెప్పాడు. డౌన్‌పేమెంట్‌ కింద రూ.2 లక్షలు చెల్లించాడు. ఆపై టెస్ట్ డ్రైవింగ్ కోసమంటూ కారును బయటకు తీసుకెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి కోసం నాలుగు నెలలపాటు ఎదురుచూసినా తిరిగి వెనక్కి రాకపోవడంతో తాజాగా షోరూం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. దీని ఖరీదు అక్షరాల రూ.18.6 లక్షలు ఉన్నట్టుగా భాదితుడు తన కంప్లేంట్ లో పేర్కొన్నాడు .. 

Tags:    

Similar News