ఇక్కడ కూల్..... అక్కడ హీట్....

Update: 2019-06-15 09:34 GMT

ఇక్కడ కూల్..... అక్కడ హీట్....తెలంగాణలో కాస్త చల్లని వాతావరణం ఉండగా.... ఏపీలో వానాకాలంలోను ఎండలు దంచికొడుతున్నాయి. రుతు పవనాల ఆలస్యం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రుతు పవనాలు సకాలంలో వచ్చి ఉంటే ఈపాటికి విస్తరించి వర్షాలు పడేవి. రుతుపవనాల రాక కోసం ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు.

చివరి దశలనూ భానుడు భగభగ మండుతూనే ఉన్నాడు. ఏపీలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.25 డిగ్రీలు, విజయనగరంలో 45.19 డిగ్రీలు, తూర్పు గోదావరి జిల్లా చామవరం, తునిలో 45.18 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో 44.90 డిగ్రీలు నమోదు కాక మరో 31 ప్రాంతాల్లో 44 నుండి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 172 ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ నెల 18 వరకు ఎండల తీవ్రత ఉంటుందని ఆర్‌.టి.జి.ఎస్. వాతావరణంలో తేమశాతం పడిపోవడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయంటున్నారు. వడ గాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

Similar News