మసూద్ మరణవార్తపై పాకిస్థాన్ తాజా ప్రకటన చూస్తే..

Update: 2019-03-04 02:51 GMT

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాకుడు మౌలానా మసూద్ అజహర్ బ్రతికే ఉన్నాడని పాకిస్థాన్ ప్రభుత్వం అంటోంది. అలాగే అతను బ్రతికి ఉన్నాడని పాక్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. నిన్నంతా మసూద్ కిడ్నీ వ్యాధితో చనిపోయాడని పాక్ ప్రభుత్వం కోడై కూసింది. తాజాగా అతను మరణించలేదని, సజీవంగా ఉన్నాడని అంటోంది. మసూద్‌ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్‌ పేర్కొంది.

కాగా భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ కథనాలు నేపథ్యంలో మసూద్‌ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్‌ తెలిపింది. గా, మసూద్‌ తీవ్ర అనారోగ్యంతో ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే అంశం మినహా తమకు ఎలాంటి సమాచారం లేదని భారత అధికారులు స్పష్టం చేశారు. పాక్‌ ప్రభుత్వం నుంచి మసూద్‌ పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదని.. పాక్‌ సమాచార మంత్రి ఫవాద్‌ చౌధరి పేర్కొన్నారు.

Similar News