ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Update: 2019-07-14 06:35 GMT

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మాడ్రిడ్ పట్టణ ప్రాంతంలో శనివారం భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంపం ధాటికి సుమారు 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఇప్పటికీ ఒక్క మరణం కూడా సంభవించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 5.8గా నమోదనట్లు ది ఫిలిప్పీన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వోల్కనోలజీ అండ్ సీస్మోలజీ వెల్లడించింది.

భూకంప తీవ్రతకు పలు భవనాలు, చర్చిలు ధ్వంసమయ్యాయి. లక్షలాదిమంది ప్రజలు ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రజలు ఇళ్లనుంచి బైటికి పరుగెత్తారని, అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని మాడ్రిడ్‌ పట్టణం పోలీస్‌ చీఫ్‌ లెఫ్ట్‌నెంట్‌ విల్సన్‌ యోనైట్‌ చెప్పారు. మాడ్రిడ్‌ జిల్లా ఆసుపత్రిలో రోగులను కూడా అక్కడినుంచి తరలించారని ఆయన అన్నారు. అయితే చుట్టూ సముద్ర ప్రాంతం కావడంతో సునామీ వస్తుందేమోనని వదంతులు వచ్చాయి. కాగా, అలాంటి భయమేం లేదని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News