లిబియాలో వైమానిక దాడి..40మంది మృతి

Update: 2019-07-03 07:35 GMT

లిబియాలో వైమానిక దాడి జరిగి 40మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ట్రిపోలి నగర శివారులోని తజౌరా అనే ప్రాంతంలో ఉన్న వలసదారుల పునరావాస కేంద్రంపై మంగళవారం రాత్రి ఈ దాడి చేశారు. వసలదారులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు.

మృతుల్లో చాలా మందిని అఫ్రికా వలసదారులుగా గుర్తించారు. దాడి సమయంలో కేంద్రంలో దాదాపు 120 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.

దాడికి పాల్పడింది ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. లిబియా దేశాధినేత గడాఫీని 2011లో హతమార్చిన నాటి నుంచి ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఐరాస గుర్తించిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఎల్‌ఎన్‌ఏగా ఏర్పడి తరచూ హింసకు పాల్పడుతోంది. అధికారిక ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తోంది.

Tags:    

Similar News