విమానం కూలి 11 మంది మృతి

Update: 2019-06-23 15:07 GMT

అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఓ విమానం కూలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. డిల్లింగ్హమ్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. విమానం ఓహు పారాచ్యూట్ స్కైడైవింగ్‌ ‌సంస్థకు చెందినదిగా తెలిపారు. ఘటన జరగడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News