ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధించాలి- కేసీఆర్‌

Update: 2018-05-10 07:43 GMT

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కూలీలకు ఇచ్చే డబ్బును సగం ప్రభుత్వం భరించాలి..సగం రైతు భరించాలని కేంద్రానికి సూచించారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. ఆంధ్రా నాయకుల తొత్తులుగా ఉండి టీ కాంగ్రెస్ నేతలు వ్యవసాయాన్ని నాశనం చేశారని సీఎం విమర్శించారు. 

Similar News