రజనీ.. కమల్ కు పోటీగా కొత్త పార్టీ

Update: 2018-03-12 07:07 GMT

తమిళనాడు రాజకీయం ఇప్పుడు రంజుమీదుంది. ఓ వైపు రాజకీయాల్లో అడుగులు వేసేందుకు రజనీకాంత్ ఎత్తులు వేస్తుంటే.. అంతకు ముందే మేల్కొన్న కమల్ హసన్ మక్కల్ నీది మయ్యం అంటూ పార్టీని పెట్టి.. జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు.. ఈ ఇద్దరికీ పోటీగా.. నేనున్నా అంటూ వచ్చేస్తున్నారు.. తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పిన శశికళ మేనల్లుడు దినకరన్.

అన్నాడీఎంకే పార్టీపై పెత్తనం చలాయించడం వీలు కాక.. విధిలేని పరిస్థితుల్లో సొంత కుంపటి నడిపిస్తున్న దినకరన్.. చివరికి కొత్త పార్టీ పెట్టేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 15న కొత్త పార్టీని ప్రకటిస్తానని కూడా చెప్పేశారు. ఇప్పటికే.. అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్లో మెజారిటీ మంది.. తన వెంటే ఉన్నారని దినకరన్ చెబుతున్నారు. తన స్లీపర్ సెల్స్ కూడా పార్టీలో ఉన్నాయని చాలాసార్లు చెప్పారు.

దీంతో.. దినకరన్ కొత్త పార్టీ పెడితే.. కచ్చితంగా ఆ ప్రభావం అన్నాడీఎంకేపై పడడం ఖాయం. తర్వాత.. రజనీ, కమల్ పార్టీలపై అది ఎంత వరకూ పడుతుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే.. రజనీ స్టార్ డమ్ ను తక్కువగా అంచనా వేయలేం. అలాగే.. కమల్ హసన్ పై ఎత్తులనూ తక్కువ చేసి చూడలేం. అలాగే.. ఈ ఇద్దరికీ పోటీగా దినకరన్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ముందు ముందు.. ఈ రాజకీయ సమీకరణాలు ఎటు దారి తీస్తాయన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది.

Similar News