గెలుపులో పాఠాలు ఉంటే.. ఓటమిలో గుణపాఠాలు: కేటీఆర్

Update: 2018-12-20 11:05 GMT

గెలుపులో పాఠాలు ఉంటే ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని టీఆర్ఎస్ పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ కె. కెటిఆర్ అన్నారు. జిల్లావారి పర్యటనలో భాగంగా కెటిఆర్ గురువారం జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యకర్తల సభలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందగానే ఎవరు పొంగిపోవద్దు, అహంకారం నెత్తికెక్కెద్దని కెటిఆర్ అన్నారు. గెలుపులో పాఠాలు ఉంటే, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయన్న విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలని కెటిఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించగానే మనకు ఎదురు లేదన్న తీరుతో కాకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నడవాలని కెటిఆర్ పెర్కోన్నారు. 

Similar News