కరుణానిధి కళ్లజోడు కథ ఇదీ!

Update: 2018-08-08 04:36 GMT

కరుణానిధి అనగానే కళ్లకు నల్ల కళ్లద్దాలు, ఒంటిపై పసుప పచ్చని శాలువ ధరించిన నిలువెత్తు రూపం చప్పున స్ఫురిస్తుంది. ఈ రెండూ లేకుండా ఆయన కనిపించడం అరుదనే చెప్పుకోవాలి. శాలువ సంగతి పక్కనపెడితే, నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరిస్తారనే విషయం చాలామందికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. అరవైయేళ్ల క్రితం కరుణానిధి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైంది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో 1952లో తిరుప్పత్తూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో కరుణానిధి కంటికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా, గాయాన్ని లెక్కచేయకుండా దాల్మియాపురం పేరును కళ్లకుడిగా మార్చాలని నినదిస్తూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆరు నెలలు కారాగార జీవితాన్ని అనుభవించారు.

ఈ పరిణామాలతో కంటికి తగిలిన గాయం మరింత తీవ్రమైంది. వైద్యులు చికిత్స చేయగా.. అప్పటి నుంచి కళ్లజోడు ధరిస్తూ వచ్చారు. 66 ఏళ్లపాటు కరుణానిధి నల్ల కళ్లజోడు ధరించారు. తొలినాళ్లలో సాధారణ కళ్లజోడు ఉపయోగించినా, తర్వాత విదేశాల నుంచి దిగుమతి చేసిన కళ్లజోడు ఉపయోగించారు.  

Similar News