దక్షిణాఫ్రికా సిరీస్ లోబాల్ట్యాంపరింగ్ కు పాల్పడి జట్టు నుంచి సస్పెన్షన్ కు గురయ్యాడు స్టీవ్ స్మిత్. ప్రస్తుతం డేవిడ్ వార్నర్‌తో పాటు స్మిత్ కెనడా టీ20 లీగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్ ద్వారా వచ్చిన డబ్బును వివిధ స్వచ్ఛంద సంస్థలకు, క్రికెట్ ప్రచార కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్లు ఈ మాజీ సారథి ప్రకటించాడు. ఈ విషయాన్నీ అధికారికంగా క్రికెట్ ఆస్ట్రేలియా స్వయంగా అధికారిక వెబ్సైట్ లో వెల్లడించింది. కాగా ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే కెనడా లీగ్‌లో స్మిత్ తోపాటు డేవిడ్ వార్నర్ కూడా పాల్గొననున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా.. కెనడా పట్టణాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఆరో జట్టు క్రికెట్ వెస్టిండీస్ తరుపున బరిలోకి దిగనుంది.