వరల్డ్ కప్‌కు శ్రీలంక అర్హత

Update: 2017-09-21 15:54 GMT

దుబాయ్: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2019 కు శ్రీలంక అర్హత సాధిం చింది. ఓల్డ్ ట్రాఫో ర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఓటమి పాలు కావడంతో శ్రీలంక కు ఈ అవకాశం లభించింది. దీంతో వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన చివరి, ఎనిమిదో జట్టుగా శ్రీలంక నిలిచింది. మంగళవారం రాత్రి జరిగిన వన్డేలో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వరల్డ్ కప్‌కు డైరెక్ట్ ఎంట్రీ చివరి తేదీ ఈ నెల 30 నాటికి వెస్టిండీస్ జట్టు శ్రీలంకను (86 పాయింట్లు) దాటి ముందుకు వెళ్లే అవకాశం లేదు.

వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం 78 పాయింట్లతో ఉంది. వరల్డ్ కప్‌కు క్వాలిఫై కావాలంటే ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గెలవాల్సి ఉండింది. అయిన ప్పటికీ వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సాధించే అవకాశముంది. కానీ వచ్చే ఏడాది జరగనున్న క్వాలిఫయింగ్ టోర్నీలో వెస్టిండీస్ జట్టు టాప్-2 లో నిలవాల్సి ఉంటుంది. 1996 చాంపియన్స్ జట్టు శ్రీలంక ఆతిథ్య ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాలతో కలిసి నేరుగా వరల్డ్ కప్ మెయిన్ డ్రాకు చేరుకుంది. 

Similar News