రాజ్యసభ ప్రసంగంలో విఫలమైన సచిన్‌

Update: 2017-12-21 11:14 GMT

క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్ తొలిసారి పార్లమెంటులో ప్రసంగించాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్‌లను ముడిపెడుతూ ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య  క్రీడల అంశంపై మాట్లాడేందుకు సచిన్ సభలో లేచి నిలుచున్నారు. కానీ ఆందోళనలు మిన్నంటాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. భారీగా అరుపులు, కేకలు వినిపించారు. సభ గందరగోళంగా మారింది. సచిన్ టెండూల్కర్ క్రీడల అంశంపై మాట్లాడలేకపోయారు. దీంతో తన అరంగేట్ర ప్రసంగంలో సచిన్ రాజ్యసభలో విఫలమయ్యారు. ఇక సచిన్‌ ప్రసంగం అడ్డుకోవటంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచవేదికగా సచిన్‌ ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడుతుంటే అడ్డుకోవటం సిగ్గు చేటు. పైగా ఆయన ప్రసంగించబోయే అంశం ఎంత కీలకమైందో ప్రతీ ఒక్కరికీ తెలుసు. సభ ఉంది కేవలం రాజకీయ నేతలు మాట్లాడేందుకే కాదు కదా.. అని ఎంపీ జయాబచ్చన్‌ అన్నారు.
 

Similar News