రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఊహించని మలుపులు

Update: 2018-08-09 05:01 GMT

మరో గంటలో రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపధ్యంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి, ఈ ఎన్నికలో ఎలాగైన విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధికి మద్ధతిస్తామంటూ ప్రకటించిన మమత బెనర్జీ  మాటమార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని ఎంపీలను ఆదేశించినట్టు సమాచారం. ఇక ఇదే సమయంలో  కాంగ్రెస్‌ అధినేత రాహుల్ గాంధీ ఫోన్ చేసినా  మద్ధతిచ్చేందుకు  ఆప్‌, పీడీపీలు నిరాకరించాయి. ఇక నిన్నటి వరకు కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన వైసీపీ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు ప్రకటించింది. ఇక డీఎంకేకు చెందిన నలుగురు ఎంపీలు ఇంకా చెన్నైలోనే ఉండటంతో ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


 

Similar News