‘ఒక్క అవకాశం ఇచ్చిచూడండి.. నీతివంతమైన పాలన అందిస్తాం’

Update: 2018-11-30 12:19 GMT

భారతీయ జనత పార్టీని ఒక్క సారి గెలిపిస్తే నీతి వంతమైన పాలనను అందిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యనించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకొవడం మరీ విడ్డురంగా ఉందని ఈ పొత్తును ప్రజలు ఎట్టి పరిస్థితిలో కూడా విశ్వసించరంటూ రాజ్ నాథ్ అన్నారు. నేడు హన్మకొండలోని జే ఎన్‌ ఎస్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘మార్పు కోసం బీజేపీ’ బహిరంగ సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని చాలా కాలంపాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజల విశ్వసనీయత కోల్పొయిందన్నారు. తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గడిచిన నాలుగున్నరేండ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తనకు ఇష్టమోచ్చిన పథకాలను చేపట్టి ప్రజాధనం వృధాచేశారని దుయ్యబట్టారు. వరంగల్ ఎక్కడ చూసిన గుంతల మహీమే కనిపిస్తోంది దిన్ని బట్టే అర్ధమైతుందో కెసిఆర్ పాలన ఎలా ఉందో చెప్పనక్క్లేదని అన్నారు. భారతదేశ ప్రధాని మోడీ హాయంలో దేశం పరుగులు పెడుతుందని తెలంగాణ మాత్రం ఇంకా దీనస్థితిలోనే ఉందని అన్నారు. నేడు ప్రపంచంలోనే టాప్ టెన్ లో భారతదేశం ఆరవస్థానంలో నిలించిందని వెల్లడించారు.
 

Similar News