గవర్నర్‌కు ప్రజాకూటమి నేతల వినతిపత్రం

Update: 2018-12-10 11:08 GMT

గవర్నర్‌ను కలిసిన ప్రజాకూటమి నేతలు భాగస్వామపక్షాలను ఒక పార్టీగా పరిగణించాలంటూ వినతిపత్రం ఇచ్చారు. కూటమి నేతలు ఉత్తమ్‌, భట్టి, షబ్బీర్‌, కోదండరామ్‌, చాడ గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి ప్రజా కూటమిగా ఏర్పడ్డామని గవర్నర్ కు తెలిపారు. ప్రజాకూటమిగా ఎన్నికల ముందే ఏర్పడ్డామని అన్ని పార్టీలు కలిసి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను కూడా ఇచ్చామని చెప్పారు. ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నేతలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినా కూడా కూటమి కొనసాగుతుందన్నారు. తెలంగాణలో తాజా పరిణామాలతో పాటు ఓట్లగల్లంతు, ఎన్నికలు నిర్వహించిన తీరుపై కూడా కూటమి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాకా కూడా కూటమి కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

Similar News