రేవంత్‌ రెడ్డి విడుదల..

Update: 2018-12-04 11:33 GMT

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి రేవంత్‌ను ప్రత్యేక వాహనంలో కొడంగల్‌లోని ఆయన నివాసానికి తరలించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆదేశాల మేరకు రేవంత్‌ను పోలీసులు విడుదల చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఈ తెల్లవారు జామున రేవంత్‌ను అరెస్ట్‌ చేసి జడ్చర్ల పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. అయితే, రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ స్టార్ క్యాంపెయినర్ అని ఆయన ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని రజత్ కుమార్ ఆదేశించారు. ఈసీ ఆదేశాలతో రేవంత్‌ రెడ్డిని విడుదల చేశారు. 
 

Similar News