నా భార్యతో కలిసే.. ముగ్గురం కాపురం చేసుకుందాం

Update: 2018-07-27 12:01 GMT

అతడో ప్రముఖ కవి, పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో అధికారి. కానీ అతడి బుద్ది గడ్డి తింది. వంకర బుద్దితో పరిశోధనా సంస్థ ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో అతని వేధింపులు తాళలేక బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి.. కేరళలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు. తన కవితలతో ప్రసిద్ధి చెందిన అతడు రాజేంద్రనగర్‌లోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జరిగిన కవి సమ్మేళనానికి గతంలో హాజరయ్యాడు. ఆ సమయంలో ఓ ఉద్యోగినితో ఏర్పడిన పరిచయాన్ని.. సామాజిక మాధ్యమాల్లో సంభాషణలు కొనసాగించే వరకు తీసుకొచ్చాడు. గత జన్మలో నువ్వు నా శ్రీమతివి . ఈ జన్మలోనూ మన మనసులు కలిశాయి. మన బంధం ఎన్ని జన్మలకైనా కొనసాగుతుంది. నిన్ను చూడటంతోనే గత జ్ఞాపకాలు నాలో మేల్కొన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టసాగాడు. గత జన్మబంధం గురించి నా భార్యకు చెప్పాను. నాతో వస్తే మనం ముగ్గురం కలిసి కాపురం చేసుకుందామంటూ వేధింపులకు దిగాడు. దీంతో సదరు ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. బుధ్ది మార్చుకుంటాను అనడంతో అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కొద్దిరోజులు మామూలుగానే ఉన్న ఆ వ్యక్తి… తాజాగా మళ్ళీ ఆ మహిళను వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Similar News