హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోలు..

Update: 2018-02-15 06:59 GMT

‘ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోలు పోస్తాం’ అనే నిబంధనకు కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ- థార్వాడ్ జంట నగరాల పోలీసులు శ్రీకారం చుట్టారు.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వీలుగా ద్విచక్రవాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. బంకుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు హెల్మెట్‌ లేకుండా వచ్చిన వాహనచోదకులకు పెట్రోలు పోయకూడదనే నిబంధనను అమలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు హెల్మెట్‌ లేకపోవడమేనని ప్రచారం చేసినా వాహనచోదకులు పెడచెవిన పెట్టడంతో హెల్మెట్‌ ఉంటేనే పెట్రోలు పోసేలా నిబంధనలు అమలులోకి తీసుకువచ్చారు.

Similar News