ఫోక్స్‌వాగన్‌కు 100 కోట్ల జరిమానా!

Update: 2018-11-16 13:19 GMT

జర్మన్ దేశానికి చెందిన కార్లకంపెనీ అయిన ఫోక్స్ వాగన్ ను ఉన్నపలంగా  రూ. 100 కోట్లు సీపీసీబీ వద్ద కట్టాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రీబ్యునల్ ఆదేశాలు జారిచేసింది. ఫ్రోక్స్ వాగన్ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార టెస్ట్ ల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో నేషనల్ ట్రిబ్యునల్ సంస్థ ఉన్నపలంగా ఉత్తర్వులు జారిచేసింది. ఈ పరికరం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలిగిందో  తెలియజేయడాని పర్యవరణశాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో కమిషన్‌ను ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటుపరిచారు. 7రోజుల్లో సంస్థ అభ్యంతరాలను దాఖలు చేయాలని ఫోక్స్‌వాగన్‌తోపాటు పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇప్పటివరకు 3.23 లక్షల వాహనాలను రీకాల్ చేస్తామని గతంలో ఎన్‌జీటీకి కంపెనీ తెలిపింది. 
 

Similar News