ఆ కేరళ ప్రెగ్నెంట్‌ వుమన్‌ పరిస్థితి...ఇంతకీ ఏమైంది?

Update: 2018-08-18 05:10 GMT

నిండుచూలాలు. నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంటి చుట్టూ వరదనీరు. వాహనం రాలేదు. వాహనం పోలేదు. కదలడానికి వీల్లేదు. గర్భిణీకి పెయిన్స్‌ అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఆ ప్రెగ్నెంట్‌ వుమన్‌ సుఖంగా ప్రసవించిందా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్‌ రేపింది, ఆ కేరళ ప్రెగ్నెంట్‌ వుమన్‌ పరిస్థితి. ఇంతకీ ఏమైంది?

 ప్రసవ వేదనతో బాధ పడిన గర్భిణి. వరద నీటిలో చిక్కుకుంది. ఇంటి చుట్టూ వరదనీరే చుట్టుముట్టడంతో, ప్రసవం కష్టమైంది. కానీ ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇలా హెలికాప్టర్‌తో ఇంటిమీద వాలిపోయారు. తాడు సాయంతో జాగ్రత్తగా హెలికాప్టర్లోకి చేర్చారు. మరి ఆ గర్భిణీ సుఖంగా ప్రసవించిందా?

వాతావరణం అనుకూలించపోయినా విజయ్‌ వర్మ అనే పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించారు. జాగ్రత్తగా హెలికాప్టర్‌ నడిపి ఆమె ప్రాణాలను కాపాడాడు. వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. కొంత సేపటికే ప్రసవించిన ఆమె, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తల్లీబిడ్డలిద్దరూ సేఫ్‌గా ఉన్నారు. వైద్యులకు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు కుటుంబసభ్యులు. గర్భిణిని తాడు సాయంతో జాగ్రత్తగా హెలికాప్టర్లోకి చేరుస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. రెస్క్యూ సిబ్బందిపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. 

Similar News