టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని మరో అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతోజరిగిన తొలి టీ20లో అత్యధిక క్యాచ్లందుకన్న వికెట్ కీపర్‌గా రికార్డు నమోదు చేశాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో హెన్‌డ్రీక్స్ క్యాచ్‌తో ఈ ఘనతను సొంతం చేసుకున్నా డు. ఓవరాల్‌గా 275 టీ20ల్లో ధోని 134 క్యాచ్లందుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర(133) ను అధిగమించాడు. టీ20ల్లో ధోనీ ఇప్పటి వరకు మొత్తం 139 క్యాచ్‌లు అందుకున్నాడు. దినేశ్ కార్తీక్(123), కమ్రాన్ అక్మల్(115), రామ్‌దిన్(108), ఓజా(106) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.