కోతులు ఆ రెస్టారెంట్ యజమాని జీవితాన్నే మార్చేశాయి. నిన్నటి వరకు ఈగలు తోలుకున్న వ్యక్తి నేడు కష్టమర్లతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇంతకీ అదెలా సాధ్యం అంటారా..?
ఆ రెస్టారెంట్లోకి వెళ్లాలని కస్టమర్స్ ఉత్సాహం చూపిస్తారు. లేట్ అయినా పర్లేదు... ఇంకా చెప్పాలంటే అక్కడ తినకున్నా ఏం కాదు కానీ... రెస్టారెంట్లోకి అడుగుపెడితే చాలని కోరుకుంటారు. ఆ హోటల్ ముందు క్యూ కడతారు.
జపాన్ టోక్యోలోని కయాబుకియా టావెర్న్ రెస్టారెంట్
టోక్యోకి చెందిన కయాబుకియాకు సాకేహౌస్ అనే రెస్టారెంట్ ఉంది. అన్నీ ఉన్నా అల్లుడినోట్లు శని అన్నచందంగా రెంస్టారెంట్లో అన్నీ రకాల వసతులున్నాయి. అన్నీరకాల వంటకాలున్నాయి. కానీ రెస్టారెంట్‌కు వచ్చే లాభాలు మాత్రం చాలా తక్కువ. దీంతో ఏం చేయాలో పాలుపోని యజమాని ఎలాగైన తన హోటల్ కష్టమర్లతో కిటకిటలాడిపోవాలని బిజినెస్ ప్లాన్స్ కోసం అన్వేషిస్తున్నాడు. అయితే ఓ రోజు రెస్టారెంట్లో తాను ఏ పని చేస్తే తాను పెంచుకునే కోతులు యట్ చాన్, ఫకు చాన్ లు ఫాలో అవుతున్నాయి. అప్పుడే అతగాడికి మెరుపులాంటి ఐడియా తన తట్టింది. సాదారణంగా రెస్టారెంట్లలో సర్వర్లు పనిచేస్తారు. కానీ ఆ రెస్టారెంట్లో కోతులే సర్వర్లుగా పనిచేసేలా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆ రెండు కోతులకి సర్వర్లు చేసే పనులన్నీ నేర్పించాడు. అంతే దశ తిరిగి ఆ రెస్టారెంట్ జీవితం మారిపోయింది. కోతుల సందడి, పనితీరుతో కష్టమర్లు క్యూ కడుతున్నారు. లాభాలు గడిస్తున్నాడు.
ఆ రెండు కోతులు
రెస్టారెంట్లోకి అడుగుపెట్టేవారికి సాదరంగా స్వాగతం ఆ రెండు కోతులు పలుకుతాయ్. ఎవరైనా కస్టమర్ ఆశ్చర్యపోయి ఆ కోతుల వైపు ఆసక్తిగా చూస్తే బాల్మీద నడవటం, ఫోజులు కొట్టడం.. చేస్తూ ఆతిథ్యంలోనే కాస్త వెరైటీ ఫన్ను ఇస్తాయ్. కష్టమర్లు అడిగిందే తడువుగా ఆర్డర్‌ను తీసుకొచ్చేస్తాయ్. అక్కడ తినేవారికి వినోదమనేది మినిమమ్ గ్యారెంటీ.
కోతులకూ రెస్టారెంట్ యజమాని మాస్కులు వేయిస్తాడు. ఒక్కో రోజు ఒక్కో గెట్‌పలో ప్రత్యక్షమవుతాయ్. టై కట్టుకని వెయిటర్ జాబ్‌ను పక్కాగా నిర్వర్తిస్తాయ్. యట్ చాన్ రెస్టారెంట్‌లోని టేబుల్ మధ్య చకచకా పరుగెడుతుంది. కస్టమర్స్ అడిగిన ఫుడ్‌తో పాటు బీర్, ఇతర డ్రింక్‌లను స్పీడ్‌గా సప్లై చేస్తుంది.
కస్టమర్స్ తినటం అయిపోయాక చేతులు శుభ్రపరచుకోవటానికి హాట్ టవల్‌ను తీసుకొచ్చి మరీ ఇస్తుంది ఫకు చాన్. దాని హాస్పిటాలిటీ చూస్తే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. రెస్టారెంట్లో ఉండే ఈ జంట వెయిటర్స్‌ను చూడటానికే ఎక్కువ మంది వస్తుంటారు. ఇతర దేశాలవారూ తెల్సుకుని మరీ ఆ రెస్టారెంట్లోకి వెళ్తుంటారు. వీలైతే రెండు సెల్ఫీలు, నాలుగుఫోజులు కొడతాయి ఈ మంకీ వెయిటర్స్.
మా పిల్లలే చెప్పిన మాట వినరు.. అలాంటిది ఇక్కడ కోతులు భలే వింటున్నాయంటూ కస్టమర్లు ముచ్చటపడటం ఇక్కడ కామన్. కొందరి మనుషుల కంటే ఇవి చాలా నయమంటూ కస్టమర్లు తెగ సంబరపడిపోతుంటారు. ఈ వెయిటర్స్‌కు టిప్‌గా పండ్లు, సోయా బీన్స్ ఎక్కువగా కస్టమర్స్ ఇస్తుంటారు. ఎందుకంటే వాటికి సోయాబీన్స్ అంటే చాలా ఇష్టం.
మొత్తానికి కోతులే వెయిటర్స్‌గా ఉండటం అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. ఆ కోతులవల్లే కయాబుకియా రెస్టారెంట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అంతేకాదండోయ్ చాన్ జోడీ తర్వాత వాటికి పుట్టిన మూడు పిల్లకోతులు ఆ రెస్టారెంట్లో వెయిటర్స్‌గా పనిచేస్తాయట. ఇందుకోసం ట్రైనింగ్ అవుతున్నాయి కూడా.