ఒక ద్రోహి సమాచారం వల్లే ఆ ఎన్‌కౌంటర్‌

Update: 2018-03-03 07:34 GMT

తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో అగ్రనేతలెవరూ లేరని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. ఈమేరకు ఆయన పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. కార్పొరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని, ప్రజల సహకారంతో ఈ దాడులన్నింటినీ తిప్పికొడతామని ఆయన అన్నారు. నీళ్లు, భూమిని కార్పొరేట్ శక్తులు దారాదత్తం చేసేందుకే నియంత అయిన కేసీఆర్ ఈ విధమైన బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఎన్ కౌంటర్ లో ముఖ్య నాయకులు ఎవరూ చనిపోలేదన్నారు.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 10 మందిలో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారని జగన్ తెలిపారు.

Similar News