అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా :కేటీఆర్‌

Update: 2018-12-17 14:10 GMT

తెలంగాణలో టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా తీర్చదిద్దేందుకు కృషి చేస్తాన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానన్నారు. ప్రభుత్వానికి , ప్రజలకు మధ్య పార్టీ వారదిగా ఉండేలా దృష్టిసారిస్తాన్నారు. అటు ఎంతో నమ్మకంతో సీఎం కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను చిత్తశుద్దితో నిర్వహిస్తానన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణభవన్ వరకు పార్టీ కార్యకర్తలు , నాయకులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణభవన్ కు పెద్దఎత్తున పార్టీ సీనియర్ నాయకులు, జిల్లాల నుంచి  కేడర్ తరలివచ్చారు. తొలుత పార్టీ కార్యాలయం ఆవరణలోని తెలంగాణ తల్లి , ప్రోఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆ తర్వాత సరిగ్గా 11 గంటల 56 నిమిషాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. పార్టీ ముఖ్యనేతలంతా తెలంగాణ భవన్ కు వచ్చి కేటిఆర్‌కు అభినందనలు తెలిపారు. 

వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ను తిరుగులేని రాష్ట్ర సమితిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. ప్రభుత్వానికి , ప్రజలకు మధ్య పార్టీ ఉండేలా ప్రయత్నిస్తానన్నారు. పార్టీ కేడర్ కు శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు వందేళ్లు పార్టీ మనుగడ సాగించేలా నిర్మాణం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు కేటీఆర్. జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేస్తామన్నారు.
రేపటినుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు చేయనున్నారు. జిల్లా పర్యటన తర్వాతా పార్టీ పక్షాలళనకు పదవులు పందేరానికి శ్రీకారం చుట్టనున్నారు. 

Similar News