కేరళను వణికిస్తోన్న ర్యాట్ ఫీవర్

Update: 2018-09-04 05:02 GMT

వరదలతో అతాలకుతలమైన కేరళ వాసులను కొత్త సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయ్. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో లెప్టోస్పిరోసిస్‌ వణికిస్తోంది. తీవ్రజ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, రక్తస్రావం, వాంతులతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. లెప్టోస్పిరోసిస్‌తో ఇప్పటి వరకు  2వందల మంది రోగులు ఆసుపత్రుల్లో చేరితే 10 మంది మృతి చెందినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మృతి చెందిన వారిలో ఐదుగురు కార్మికులు పునరావాస పనుల్లో పాల్గొన్నారు.

ర్యాట్ ఫీవర్ మహమ్మారి ప్రబలుతుండటంతో వరద సహాయ పనులు చేస్తున్న కార్మికులకు ముందుజాగ్రత్తగా డాక్సీసెలైన్ టాబ్లెట్ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కేకే శైలజ తెలిపారు. జంతువుల మూత్రం నీటిలో కలిసి కలుషితమవడంతో బాక్టీరియా ప్రబలి ప్రజలు లెప్టోస్పిరోసిస్‌ బారిన పడుతున్నారని మంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ర్యాట్ ఫీవర్ నివారణకు సర్కార్‌ ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది
 

Similar News