లోయలో పడ్డ విద్యార్థి...

Update: 2018-09-28 08:46 GMT

 పశ్చిమ ఒడిశాలో బరాగర్‌ జిల్లాలో  ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి  లోయలో పడిపోయాడు. డీయోదరా హిల్‌లోని నలీచుహాన్‌ జలపాతాన్ని చూసేందుకు  ఫ్రెండ్స్‌తో వెళ్లిన రాహుల్‌ దాస్‌ అదుపుతప్పి కిందపడిపోవడం వైరల్‌గా మారింది. అప్పటి వరకు స్నేహితులతో సెల్పీలు దిగిన రాహుల్‌ ఫోన్‌ను పక్కన పెట్టి  తిరిగి పైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అలా  అడుగువేయగానే  షూ జారడంతో అదుపుతప్పి లోయలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో  ప్రాణాలతో బయటపడ్డా.. వెన్నుముకకు తీవ్ర గాయం కావడంతో డాక్టర్లు సర్జరీ చేశారు.  ఈ తతంగాన్నంతా ఈ బాధితుడి స్నేహితుడు వీడియో తీయడంపై వైరల్‌గా మారింది.

Similar News