మొత్తం 3వేల 583 నామినేషన్లు దాఖలు: సీఈవో రజత్ కుమార్

Update: 2018-11-20 13:13 GMT

తెలంగాణలో వచ్చే ఎన్నికలను దృష్టిపెట్టుకొని ఓటింగ్ శాతం పెంచడంమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్రఎన్నికల ప్రధానధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటర్ స్లీప్ పంపీణీ మొదలు పెట్టి కుటుంబసభ్యులకే ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల పెంపు, మార్పునకు విజ్ఞప్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో 32వేల 796 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సర్వీస్ ఓటర్లు 9వేల 445 మంది. లక్షా 60వేల 509 మంది పోలింగ్ సిబ్బందిని అవసరమవుతారని తెలిపారు. పోలింగ్ రోజు 30వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తమని  తెలిపారు. కాగా తెలంగాణలో మొత్తం 3వేల 538 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. ప్రతిగ్రామంలో ప్రజలకు పోలింగ్ తీరుపై అవగాహన కల్పించామని రజత్ పేర్కొన్నారు.


 

Similar News