జనాలను వెర్రోలను చేయవద్దు: శివసేనపై ఖర్గే మండిపాటు

Update: 2018-11-25 11:04 GMT

కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జునఖర్గే  ఉద్దవ్ థాకరే, శివసేన పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. బీజేపీతో  సంబంధాలు కులునుకొని పేరుకేమో అయోధ్య రామాలయ నిర్మాణంపై కేంద్ర సర్కార్ పై ఒత్తుడి తెస్తున్నామని కథలు చెబుతున్నారంటూ ధ్వజమేత్తారు. ఉద్దవ్ ఠాకరే కేవలం ఓట్ల కోసమే అయోధ్యలో తిరుగుతున్నాడని, గడిచిన నాలుగు సంవత్సరాలలో అయోధ్యలో తిరుగంగా ఎవరైనా అడ్డుకున్నారని ప్రశ్నించారు. గిప్పుడు ఎన్నికలు కాబట్టే ఎలాగైనా ఓట్లు రాబట్టడం కోసమే ఈ అయోధ్యకు వరుసగా మీటింగ్, కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి రాముడు గుర్తుకొస్తాడని ఖర్గే దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు శివసేన, వీహెచ్పీలు ఈ రోజు కార్యక్రమాలను నిర్వహించాయి. 

Similar News