సోషల్ మీడియాలో ఓ వీడియో...దుమ్ము రేపుతోంది. ఫేస్బుక్, వాట్సాప్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. టీవీల్లో ఎక్కడ చూసినా...ఈ వీడియోనే కనిపిస్తోంది. భారీ పర్సనాలిటీ ఉన్నా అదిరిపోయే డ్యాన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 50 ఏళ్లు దాటినా...డ్యాన్స్‌తో యువ హీరోలను మరిపిస్తూ అలనాటి హీరో గోవిందా స్టెప్పులతో అలరిస్తున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి. వాచ్ దిస్ స్టోరీ
బంధువుల పార్టీలు, సంగీత్, పెళ్లి, బారాత్, కాలేజ్ కల్చరల్ ఫంక్షన్స్‌లో...పాదం కదుపుతూ సాహో రే సంజీవ్ అనేలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇటీవల తన బామ్మర్ధి పెళ్లిలో భాగంగా...లేడీస్ స్పెషల్ సంగీత్ కార్యక్రమం జరిగింది. ఇందులో కపుల్స్ డ్యాన్స్ వేయాలని చెప్పడంతో...సంజీవ్ శ్రీవాస్తవ, భార్య అంజలితో స్టేజ్ ఎక్కారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డ్యాన్స్ అంటే విపరీతమైన పిచ్చి....ఇంకేముందీ గోవిందా, నీలం నటించిన ఖుదాగర్జ్ మూవీలోని పాటకు స్టెప్పులు ఇరగదీశాడు.
ఈయన పేరు సంజీవ్ శ్రీవాస్తవ. మధ్యప్రదేశ్‌లోని విదిషా స్వస్థలం. బాబా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. సంజీవ్ శ్రీవాస్తవకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చాలా ఇష్టం. తల్లి వంట చేసేటపుడు టీవీల్లో గోవిందా స్టెప్పులను...నిరంతరం ఫాలో అయ్యేవాడు. అలా డ్యాన్స్‌ల్లో మెళుకువలు నేర్చుకొని...1982 నుంచి 1990ల వరకు స్టేజ్ షోలు ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం రావడంతో విరామం ఇచ్చారు. డ్యాన్స్ లేకుండా ఉండలేకపోయారు సంజీవ్...కొంతకాలానికి మళ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.
మా వీడియో వైరల్ అవడం...జనం లైక్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు సంజీవ్ శ్రీవాస్తవ భార్య అంజలి శ్రీవాస్తవ. మా వీడియోను చూసిన తర్వాత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్వాలియర్ నుంచి బంధువులు ఫోన్ చేసి అభినందిస్తున్నట్లు చెప్పారు. సంజీవ్ శ్రీవాస్తవ స్టెప్పులను సోషల్ మీడియా ద్వారా చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్...ప్రశంసలతో ముంచెత్తారు.
हमारे विदिशा के भोपाल में कार्यरत प्रोफ़ेसर श्री संजीव श्रीवास्तव जी की ज़िंदादिली ने पूरे भारत में इंटरनेट पर तहलका मचा दिया है। मानो या ना मानो मध्यप्रदेश के पानी में कुछ तो ख़ास बात है... pic.twitter.com/8qM15uZVXF
— ShivrajSingh Chouhan (@ChouhanShivraj) June 1, 2018