పచ్చదనం పెంపునకు సహకరించండి : కేసీఆర్

Update: 2018-12-22 13:44 GMT

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌ ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి కేసీఆర్‌ వివరించారు. హైదరాబాద్‌లో 188 ఫారెస్ట్‌ బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్నామని దీనికోసం కాంపా నిధుల్లో కేంద్రం వాటా నుంచి 100 కోట్లు రాష్ట్రానికి కేటాయించాని విజ్ఞప్తి చేశారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్టేజ్‌ 2 కు పర్యావరణ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని కేసీఆర్‌ కోరారు. రాష్ట్రంలో కాళేశ్వర ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినందుకు హర్షవర్ధన్‌కు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అడవుల రక్షణకు కొత్త చట్టం తీసుకువచ్చే ఆలోచన ఉందని కేంద్రమంత్రి  హర్షవర్దన్‌ పేర్కొన్నారు. 

Similar News