కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ...కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రి వర్గం....

Update: 2018-11-06 04:57 GMT

సీఎం చంద్రబాబు అధ్య‌క్ష‌త‌న ఏపీ మంత్రి వ‌ర్గ భేటీ కాసేపట్లో జరగబోతోంది. ఉదయం 10.30కి జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కడప ఉక్కు కర్మాగారం కోసం ఏపీ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ భాగస్వామిగా రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం, అలాగే ఏలూరు, క‌డ‌ప‌, ఒంగోలు అర్బ‌న్ డెవ‌లెప్‌మెంట్ అధారిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇవాల్టి భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటిన్ల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇక ఏపీ అసైన్‌మెంట్ యాక్ట్ 1977 కు చ‌ట్ట‌ స‌వ‌ర‌ణ చేసి అసైన్మెంట్ భూముల్లో ఇళ్ల‌ స్థలాల‌ రిజిస్ట్రేషన్‌కు అనుమ‌తి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో లక్ష‌లాది మందికి ల‌బ్ది చేకూరుతుంది. అటు ప్ర‌కాశం జిల్లా దొన‌కొండ ఇండ‌స్ట్రియ‌ల్ మెగా హ‌బ్ ఏర్పాటు కోసం 2,400 ఎక‌రాలు కేటాయించాయాలని భావిస్తున్నారు.
 

Similar News