పాములతో కలసి కాఫీ తాగాలనుందా..!

Update: 2017-12-12 11:54 GMT

జిహ్వ కో రుచి, పుర్రెకో బుద్ది అని ఊరికే అనలేదు. రోజు రోజుకు మనుషుల ఆలోచనా విధానాలు మారిపోతున్నాయి.  ప్రతీ విషయం మీద అవగాహన పెరుగుతోందో, దేనైనా సాధించాల పట్టుదలో ఏమో తెలియదు కాని, కాదేది నాకు అతీతం అని ప్రవర్తన పెరుగుతోంది. ఇక విషయానికొస్తే ఎవరైనా ఫ్రెండ్స్ తోనో,  లేకపోతే బంధువులతోనే హోటల్స్ వగైరా వాటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కాని పాములతో కలసి కాఫీ, టీ లు తాగాలని అనుకుంటారా?  కాని ఇది నిజం, ఆశ్చర్యంగా ఉన్నాసరే.  ఎందుకంటే ఇటువంటి అనుభూతి జపాన్ లోని టోక్యోలోనే కలుగుతుంది. 

అక్కడి హరజుకులో యానిమ‌ల్ కేఫ్స్ కాన్సెప్ట్ తో కాఫీ షాపు వెలసింది.  పాములకు సంబంధించిన వివరాలు, వాటి మనుగడ, అవి తీసుకునే ఆహారం, వాటి జీవన విధానాలను తెలుసుకునే వీలు కలుగుతుంది. పాములతో కాఫీ ఏంట్రా బాబు, పిల్లాపాపలతో అక్కడికి వెళితే ఏమైనా ఉందా అనుకుంటే పొరపాటే.  ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్ని కూడా విషరహిత పాములే.  దాదాపుగా 20 రకాల విషంలేని పాములు ఉన్నాయిక్కడ. అంతా బాగానే ఉంది,  ఇంకేం హాయిగా పాములతో కలసి ఎంజాయ్ చెద్దామంటే మాత్రం కేఫ్ కి వెళ్ళేందుకు 5 పౌండ్లు,  పాములను పట్టుకోవాలంటే 3 పౌండ్లు చెల్లించాలట.

Similar News