మమతకు ఎదురుదెబ్బ...

Update: 2018-12-20 11:23 GMT

పశ్చిమ బెంగాల్ లో తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఉహించని భారీ షాక్ తగిలింది. భారతీయ జనత పార్టీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి లేదని రాష్ట్రసర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టిపడెసింది.  రాష్ట్రంలో మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ బీజేపీ ‘రథయాత్ర’కు బ్రెక్ వేసిన సగంతి తెలిసిందే. కాగా బీజేపీ రథయాత్ర ర్యాలీ మొదలుపెట్టే12 గంటల ముందే ఆయా జిల్లాల ఎస్పీ అధికారులకు సమాచారం ఇవ్వలంటూ జస్టిస్ తపబ్రత చక్రవర్తి ఆదేశించారు. చట్టానికి లోబడి యాత్ర నిర్వహించాలనీ, రహదారులపై వాహన రాకపోకలకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని బీజేపీ నేతలకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈరథయాత్రలో సర్కారు ఆస్తులకు ఏలాంటి నష్టం వాటిల్లినా బీజేపీ నాయకత్వమే బాధ్యత వహించాలని జస్టిస్ చక్రవర్తి స్పష్టం చేశారు.

Similar News