తెలుగు మహాసభల కోసం కేబినెట్ సబ్ కమిటీ

Update: 2017-12-12 06:56 GMT

తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, చందులాల్ కొనసాగనున్నారు. సాహిత్య అకాడమీ, ఇతర సంస్థల సమన్వయంతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే తెలుగు మహాసభలకు సంబంధించి పలు చోట్ల సన్నాహక సమావేశాలు నిర్వహించారు.

ప్రగతి భవన్‌లో సమీక్ష ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్.. ఎల్బీ స్టేడియానికి చేరుకుని తెలుగు మహాసభల ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోపం లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మహాసభలకు వచ్చే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తెలుగు మహాసభల ఏర్పాట్లను చకచక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News