తల్లి శవంపై కూర్చుని అఘోర పూజలు

Update: 2018-10-03 09:15 GMT

తన తల్లి శవంపై కూర్చుని ఓ అఘోరా అంత్యక్రియలు నిర్వహించడం తమిళనాడులో కలకలం సృష్టించింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందిన మణికంఠన్‌ అఘోరా.. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూన్న అతని తల్లి మేరీ మరణించింది. దీంతో ఆమె అంత్యక్రియలు కుమారుడైన మణికంఠన్ నిర్వహించాడు. అయితే మణికంఠన్ వారణాసిలో అఘోరాగా శిక్షణ తీసుకుని అరియమంగళంలోని జయ్ అఘోరా ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మణికంఠన్ 20 మంది అఘోరాలతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. భౌతికకాయానికి ప్రత్యేక పూజలు చేస్తూ.. ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ మణికంఠన్‌ తల్లి శవంపై కూర్చున్నాడు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ.. చిత్రవిచిత్రమైన పూజలు చేస్తుంటే.. అతడి అనుచరులు ఢమరుకం వాయిస్తూ, శంఖం ఊదుతూ బిగ్గరగా అరుస్తూ, పెద్ద పెట్టున శబ్దాలు చేశారు. ఆతర్వాత తల్లి భౌతికకాయానికి దీపారాధనలు చేసి ఖననం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Similar News