బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక...కాపాడేందుకు యత్నం

Update: 2018-08-01 07:01 GMT

బోర్ బావులు చిన్నారుల పాలిట మృత్యుకుహారాలుగా మారుతున్నాయి. నీటి కోసం వేస్తున్న బోర్లు చిన్నారులు పాలిట యమపాశాలుగా మారుతున్నాయి.  ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారి బోరు బావిలో పడిపోయిన ఘటన బీహర్‌ ముంగేర్ జిల్లాలో కలకలం రేపుతోంది.  

చిన్నారి వెతికిన  కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. తర్వాత బోరుబావిలో నుంచి కేకలు వినిపించడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. బోరుబావి లోతు  రెండు వంద అడుగులు ఉండటంతో చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు  చేపట్టారు అధికారులు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో పాప బావిలో పడిపోగా అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 

బాలిక సుమారు 48 అడుగుల లోతులో ప్రాణాలతోనే ఉందని గుర్తించిన సిబ్బంది, ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు. పాప రోదనలు బయటకు వినిపిస్తున్నాయని సీసీ కెమెరాలను పంపి పాపను గమనిస్తున్నామని  చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా పాపను బయటకు తీసేందుకు 'ఎల్' ఆకారంలో గొయ్యి తవ్వుతున్నామని తెలిపారు. తొలుత 32 అడుగుల లోతుకు నిలువునా గుంత తీసి, ఆపై 16 అడుగుల దూరాన్ని అడ్డంగా తవ్వనున్నామని తెలిపారు.

రోజులు గడిచినా  బోరు బావిలో పడిన చిన్నారి  ఇంకా బయటకు తీయలేదు.  సమయం గడిచే కొద్దీ పాప తల్లిదండ్రుల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది. తమ బిడ్డ క్షేమంగా బయట పడాలని  దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటన ప్రాంతానికి చేరుకుని  పాప క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. 

Similar News