Visakha updates: రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ: వంగలపూడి అనిత..

విశాఖ..

తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్

-ఆ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్లే సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.

-టిటిడి ఆచారం ప్రకారం డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అనే పద్ధతి 1860 నుంచి ఉంది .

-2009లో ఎం పి గా ఉన్న జగన్ తిరుమల తిరుపతి కి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి?

-మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, టిటిడి డిక్లరేషన్ పై అసెంబ్లీ లో చర్చిస్తాం అని అనడం ఘోరం.

-అంతర్వేదిలో రథానికి ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు అధికార పార్టీ ఎమ్యెల్యే.

-మంత్రి జయరాం బెంజి కార్ వ్యవహారం పక్కకు వెళ్ళడానికి మంత్రులు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.

-హిందువునైనా నన్ను కూడా హిందువు అని చూపించుకునే పరిస్థితి తెచ్చారు.

-టిటిడి సభ్యురాలిగా నేనే స్వయంగా రాజీనామా చేసాను .

-హిందు ధర్మాలు పై గౌరవం లేని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు తన పేరు మార్చుకోవాలి.

Update: 2020-09-23 08:08 GMT

Linked news