Eid-ul-Fitr 2020: చంద్ర దర్శనం కాకపోవడంతో 24 వతేదీ రంజాన్ పండుగ జరుపుకోనున్న సౌదీ అరేబియా
పవిత్రమైన రంజాన్ పండుగను ఈరోజు(మే 23) ముస్లిం సోదరులు జరుపుకోవలసి ఉంది.
అయితే, 30 రోజుల ఉపవాస దీక్ష తరువాత కావలసిన చంద్రుని దర్శనం ఈరోజు కాకపోవడంతో రంజాన్ పండుగను రేపు అంటే మే 24 వ తేదీన జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సౌదీ అరేబియాకు చెందిన ఉన్నత న్యాయ వ్యవస్థ ప్రకటించింది.
ఈద్-ఉల్-ఫితర్ అదేవిధంగా షవ్వాల్ మొదటి రోజు ఉత్సవాలను ఎప్పుడు జరుపుకోవాలనే అంశాలను ఈరోజు (మే 23) చంద్ర దర్శన కమిటీ చంద్రుని చూసిన వెంటనే వెల్లడిస్తారు.
Update: 2020-05-23 02:08 GMT